Site icon NTV Telugu

CCTV: ఫుట్‌పాత్‌పై నిల్చున్న ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

Speeding Car

Speeding Car

Delhi Man Loses Control Of Car: ఓ డ్రైవ‌ర్ కారును అతి వేగంగా న‌డిపాడు. కారు అదుపుత‌ప్పి ఓ ముగ్గురు పిల్లల‌పైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఉత్తర ఢిల్లీలోని బాగ్‌లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉద‌యం చోటు చేసుకుంది. గులాబీ బాగ్‌లో ఓ 30 ఏండ్ల యువ‌కుడు త‌న మారుతి బ్రెజ్జా కారులో వేగంగా వెళ్తున్నాడు. అంత‌లోనే కారు అదుపుత‌ప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు పిల్లల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్రమాదానికి కొంచెం దూరంలో కారును ఆపిన యువ‌కుడిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవ‌ర్‌ను స్థానికులు చిత‌క‌బాది, అనంత‌రం పోలీసుల‌కు అప్పగించారు.

Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా

దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈరోజు ఉదయం 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో స్థానికులు కారు డ్రైవరైన ప్రతాప్ నగర్ నివాసి గజేందర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆగ్రహించిన స్థానికులు ధ్వంసం చేసిన కారును స్వాధీనం చేసుకున్నారు గాయ‌ప‌డ్డ చిన్నారుల‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. 10, 4 ఏండ్ల వ‌య‌సున్న ఇద్దరు పిల్లల‌కు స్వల్ప గాయాలు కాగా, ఆరేళ్ల వ‌య‌సున్న మ‌రో బాలుడికి తీవ్ర గాయాల‌య్యాయి. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో నమోదైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే అంత‌కు ముందు కూడా గ‌జేంద‌ర్ వేగంగా కారు న‌డిపిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు. మెల్లగా న‌డ‌పాల‌ని హెచ్చరించిన‌ప్పటికీ అత‌ను వినిపించుకోలేద‌న్నారు. డ్రైవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో ఉన్నట్లు తెలిపారు.

 

Exit mobile version