NTV Telugu Site icon

Viral Video: దేశ రాజధానిలో దారుణం.. కారుతో ఢీకొట్టి.. అర కిలోమీటరు లాక్కెళ్లి..

Car Bannet

Car Bannet

Delhi Man Dragged For Half-A-Kilometre On Car Bonnet: దేశ రాజధానిలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. గురువారం రద్దీగా ఉండే పశ్చిమ ఢిల్లీ పరిసరాల్లో ఒక వ్యక్తిని కారు బానెట్‌పై అర కిలోమీటరు దూరం లాక్కెళ్లారు. రాజౌరి గార్డెన్‌ ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. అతడు ఎగిరి కారుపై పడినా కారును ఆపకుండా అలాగే ఈడ్చుకెళ్లారు. పైగా వాహనాల రద్దీ బాగా ఉన్న రోడ్డుపై ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 279, 323, 341, 308 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజౌరి గార్డెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వాహనాన్ని ఓవర్‌ టేక్ చేయడం వల్ల చెలరేగింది. కారు నడుపుతున్న హర్విందర్ కోహ్లీ స్నేహితుడు.. జయప్రకాష్ అనే వ్యక్తికి చెందిన కారును ఓవర్‌టేక్ చేసి వెనుక నుంచి హారన్ చేయడంతో గొడవ మొదలైంది. ప్రతీకారంగా నిందితులు వారి మార్గాన్ని అడ్డుకున్నారు. వెంటనే వారిపై దాడి చేసేందుకు తయారయ్యారు. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన హర్వీందర్ కోహ్లీని  నిందితులు కొట్టారు.

Tomato Curry Crime: మహిళ ప్రాణం మీదకు తెచ్చిన ‘టమాట కూర’

గొడవ సద్దుమణగడంతో నిందితుడి తండ్రి కోహ్లీని కారుతో ఢీకొట్టమని సైగ చేశాడు. ఆ నిందితుడు వెంటనే కారును కోహ్లీపైకి ఎక్కించాలని ప్రయత్నించాడు. ఈ సమయంలో కోహ్లీ కారుకు ఉన్న విండ్‌షీల్డ్ వైపర్‌లను పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. కోహ్లీని అలాగే కారు బానెట్‌పై ఉంచుకుని దాదాపు 500 మీటర్లు ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవి ఫుటేజీలు ఉన్నప్పటికీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. పోలీసులు ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు, బలవంతపు సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నారని బాధితుడు కోహ్లీ ఆరోపించారు.

 

Show comments