Viral Video: దేశ రాజధానిలో దారుణం.. కారుతో ఢీకొట్టి.. అర కిలోమీటరు లాక్కెళ్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man Dragged For Half-A-Kilometre On Car Bonnet: దేశ రాజధానిలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. గురువారం రద్దీగా ఉండే పశ్చిమ ఢిల్లీ పరిసరాల్లో ఒక వ్యక్తిని కారు బానెట్‌పై అర కిలోమీటరు దూరం లాక్కెళ్లారు. రాజౌరి గార్డెన్ ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. అతడు ఎగిరి కారుపై పడినా కారును ఆపకుండా అలాగే ఈడ్చుకెళ్లారు. పైగా వాహనాల రద్దీ బాగా ఉన్న రోడ్డుపై ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 279, 323, 341, 308 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజౌరి గార్డెన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వల్ల చెలరేగింది. కారు నడుపుతున్న హర్విందర్ కోహ్లీ స్నేహితుడు.. జయప్రకాష్ అనే వ్యక్తికి చెందిన కారును ఓవర్టేక్ చేసి వెనుక నుంచి హారన్ చేయడంతో గొడవ మొదలైంది. ప్రతీకారంగా నిందితులు వారి మార్గాన్ని అడ్డుకున్నారు. వెంటనే వారిపై దాడి చేసేందుకు తయారయ్యారు. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన హర్వీందర్ కోహ్లీని నిందితులు కొట్టారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Tomato Curry Crime: మహిళ ప్రాణం మీదకు తెచ్చిన ‘టమాట కూర’
గొడవ సద్దుమణగడంతో నిందితుడి తండ్రి కోహ్లీని కారుతో ఢీకొట్టమని సైగ చేశాడు. ఆ నిందితుడు వెంటనే కారును కోహ్లీపైకి ఎక్కించాలని ప్రయత్నించాడు. ఈ సమయంలో కోహ్లీ కారుకు ఉన్న విండ్‌షీల్డ్ వైపర్లను పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. కోహ్లీని అలాగే కారు బానెట్‌పై ఉంచుకుని దాదాపు 500 మీటర్లు ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవి ఫుటేజీలు ఉన్నప్పటికీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. పోలీసులు ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు, బలవంతపు సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నారని బాధితుడు కోహ్లీ ఆరోపించారు.
#WATCH | A man was dragged on car's bonnet in Delhi's Rajouri Garden(12.01)
An incident of road rage occured that led to incident shown in video. Case registered under IPC sec 279, 323, 341, 308. Accused identified, being interrogated: Delhi Police
(Visuals confirmed by Police) pic.twitter.com/RdVGuU7QXL
— ANI (@ANI) January 14, 2023
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!