Site icon NTV Telugu

Delhi Man: కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు

Delhi Man

Delhi Man

Delhi Man: పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి, జంతు హింస చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద గత వారం ఫిర్యాదు అందడంతో ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతుండగా, అతడిని ఎవరో వీడియో తీశారని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు చేరింది. ఈ వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?

ట్విట్టర్‌లో ఈ విషయంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన పని చేసిన అలాంటి వ్యక్తులను వదిలేయవద్దని మండిపడ్డారు. మానవమృగంపై కేసు పెట్టమంటూ జంతు ప్రేమికులు, పోలీసులకు చూపించడంతో సీరియస్‌గా తీసుకోకపోవడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాట్సాప్‌ చాటింగ్‌, స్క్రీన్‌ షాట్‌ ఫోటోల ఆధారంగా కుక్కపై అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించలేమని ..విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులపై నెటిజన్లు దుర్భాషలాడారు.

Exit mobile version