ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జారీ చేసిన ఈడీ సమన్లపై హైకోర్టులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం న్యాయస్థానం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు సీఎం కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఎనిమిది సార్లు ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. ఆయా కారణాల చేత విచారణకు హాజరు కాలేదు. తాజాగా మరోసారి ఆయనకు ఈడీ సమన్లు అందించింది.
తాజాగా జారీ చేసిన ఈడీ సమన్లపై కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేయడంతో బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనుంది. గత వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ-రూపకల్పనలో వీరంతా భాగస్వాములని ఈడీ వెల్లడించింది. ఇందులో భాగంగానే కవిత రూ.100 కోట్లు ముడుపులు చెల్లించాలని ఈడీ తెలిపింది. ఇకపోతే కవితకు మార్చి 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2022లో వెలుగు చూసింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 245 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సహా 15 మందిని అరెస్ట్ చేసింది. ఆరు ఛార్జ్‌సీట్లను కూడా నమోదు చేసింది. రూ.128 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కేందుకే కేంద్రం ఈడీని ఉపయోగించుకుని దాడులు చేస్తోందని ఆప్ ఆరోపించింది. రాజకీయ కుట్రలో భాగంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ద్వారా కుట్ర జరుగుతోందని ఆప్ మంత్రులు ఇటీవల ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Man stabs wife: మధ్యాహ్న భోజనం ఆలస్యమైందని భార్యని చంపిన భర్త..
ఈడీ సమన్లపై కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించనుంది. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందోనని ఆప్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kejriwal: ఈడీ సమన్లపై హైకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణ
