Site icon NTV Telugu

Swati maliwal: స్వాతి మాలివాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మద్దతు.. లేఖలో ఆవేదన

Swathi

Swathi

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మద్దతుగా నిలిచారు. ఆమెకు జరిగిన సంఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖలో వెల్లడించారు. స్వాతి మాలివాల్‌కు ఎదురైన బాధాకరమైన అనుభవం, సహచర నేతల నుంచి ఎదురైన బెదిరింపులు, అవమానాలు చూసి చాలా ఆవేదన చెందినట్లు వీకే.సక్సేనా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ ఘటనపై ఇప్పటివరకు కేజ్రీవాల్ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. మాలివాల్‌ను శారీరక హింసకు గురిచేయడం క్షమించరాని నేరమని.. ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Kakani Govardhan Reddy: బెంగళూరు రేవ్‌ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. బీజేపీ తొత్తులగా పని చేస్తున్నారని దుయ్యబట్టింది. ఆప్ మంత్రి అతిషి కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. స్వాతి మాలివాల్.. బీజేపీ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Simran Sister Death Mystery: 21 ఏళ్ల‌కే హీరోయిన్ సిమ్రాన్‌ చెల్లెలి సూసైడ్‌.. ఆ కొరియోగ్రాఫర్‌ వల్లే?

మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ భౌతికదాడికి తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా ఆమెను శారీరకంగా హింసించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఎట్టకేలకు ఘటన జరిగిన నాలుగు రోజులకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఎక్కడెక్కడ దాడి చేశాడో.. అవన్నీ ఎప్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tamilnadu: రచ్చకెక్కిన మాజీ డీజీపీ దంపతుల పంచాయితీ

Exit mobile version