Site icon NTV Telugu

Delhi: ఆప్‌కు భారీ షాక్.. 10 రోజుల్లో రూ.163.62 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..

Aap

Aap

Delhi: ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం రూ. 163.62 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని నోటీసులు పంపింది. ఆ ప్రకటనల ఖర్చులు వసూలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. డిపాజిట్ చేయని పక్షంలో చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొన్నారు.

Himachal Pradesh: మంత్రిత్వ శాఖలు కేటాయించిన సీఎం సుఖు.. ఎవరికి ఏం ఇచ్చారంటే?

ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్‌ ప్రకటనలు ఇచ్చుకుందని, అందుకోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వృధాగా ఖర్చు చేసిందని పేర్కొంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆ పార్టీ మీద చర్యలకు ఆదేశించారు. డిసెంబర్‌ 20వ తేదీన 97 కోట్ల రూపాయల్ని ఆప్‌ నుంచి రికవరీ చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. అయితే రాజకీయ ప్రకటనల మీద 2017, మార్చి 31 దాకా రూ.99 కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రూ.64 కోట్లను ఖర్చు చేసినదానికి వడ్డీగా తాజా నోటీసుల్లో పేర్కొంది. ఎల్జీ ఆదేశాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ మొదటి నుంచి బేఖాతరు చేస్తూ వస్తోంది. బీజేపీతో కలిసి ఆప్‌ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎల్జీపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

Exit mobile version