Site icon NTV Telugu

Cm Kejriwal: ఈడీ నోటీసులపై స్పందించని ఢిల్లీ సీఎం.. కోర్టుకు అధికారులు..

Kejriwal

Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ పట్టు బిగిస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన 5 సమన్లపై ఆప్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు.. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3తో పాటు జనవరి 18 తేదీల్లో ఈడీ ముందు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్ కు సమన్లను జారీ చేసిన వాటిని ఆయన పట్టించుకోలేదని పిటిషన్ లో తెలిపింది.

Read Also: Kenya : 191మంది పిల్లలను ఆకలితో చంపి.. అడవుల్లో పూడ్చిపెట్టిన నీచుడు

అయితే, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ అధికారులు శనివారం నాడు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ముందు ఈ ఫిర్యాదు దాఖలు చేయబడింది. ఇక, ఈ కేసును ఈరోజుకి విచారించనుంది. గత నాలుగు నెలల్లో నాలుగుసార్లు సమన్లు ​​పంపినప్పటికీ, ఆయన ఈడీ ముందు హాజరుకావడం లేదని, ఇది ​చట్టవిరుద్ధమని ఈడీ పేర్కొనింది.

Read Also: Mumbai: ముంబైలో అనుమానాస్పద పడవ.. పోలీసుల అదుపులో ముగ్గురు

ఇక, ఈడీ సమన్లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా తమ ప్రభుత్వంపై వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకుండా కుట్ర చేస్తున్నారన్నాడు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ ను పడగొట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొత్త మద్యం పాలసీ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, 2021-22 ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో మద్యం వ్యాపారులకు లైసెన్సుల మంజూరు కోసం కొంత మంది వ్యాపారవేత్తలకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ పదే పదే ఖండించింది.

Exit mobile version