Delhi Court: పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని బెదిరించిన నిందితుడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను ఎవరినైనా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు రుజువు చేయడానికి ఎటువంటి సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. 2019 జనవరిలో పోలీసు హెల్ప్‌లైన్‌కు కాల్ చేసిన మహ్మద్ ముఖ్తార్ అలీ.. ప్రధానిని చంపేస్తానని బెదిరించే ముందు దుర్భాషలాడినందుకు ఐపీసీ సెక్షన్ 506 (II) కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Read Also:Jabardasth Venu: బలగం వివాదం.. దిల్ రాజుతో కాదు దమ్ముంటే నాతో మాట్లాడు
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శుభం దేవాదియా.. అలీపై అభియోగాన్ని రుజువు చేయడానికి కీలకమైన సాక్ష్యంగా చేతితో వ్రాసిన డైరీ, పీసీఆర్ ఫామ్ గా పేర్కొన్నారు. పీసీఆర్ ఫారమ్‌ను సేకరించకపోవడంపై సంబంధిత ఏఎస్ఐ ఎటువంటి వివరణను అందించలేదన్నారు. ఆరోపించిన తేదీలో కాల్ చేసిన వ్యక్తి చేసిన ఖచ్చితమైన సంభాషణ రుజువు చేయడానికి ఇది సాక్ష్యంగా పేర్కొన్నారు. ఫారమ్ లేనప్పుడు, డైరీని కేసులో కీలక రుజువుగా పరిగణించలేమని జడ్జీ తెలిపారు. అలాగే, కాల్ చేసిన నంబర్ సూరద్ అలీ పేరు మీద జారీ చేయబడింది. ఈ వ్యక్తి పాత్రపై దర్యాప్తు జరగలేదని, ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదని ఏఎస్ఐ పేర్కొన్నారని కోర్టు తెలిపింది.
Read Also: Viral Video: స్టంట్ అదిరింది.. కాకపోతే కారు అద్దం పగిలింది
ఎవరినైనా చంపేస్తామని బెదిరింపుల రూపంలో ఏదైనా ప్రకటన చూపించే సాక్ష్యాలను రికార్డ్ చేయడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని ఈ కోర్టు భావించింది. సీజ్ మెమోలో నిందితుల నుంచి ఎలాంటి సిమ్ కార్డు రికవరీ కాలేదని, పబ్లిక్ సాక్షులు ఈ కేసులో చేరేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కోర్టు భావించింది. దీంతో కేసులో సాక్ష్యాలు బలంగా లేకపోవడంతో నిందితుడిని నిర్ధోషిగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది.