NTV Telugu Site icon

Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు

Kejriwal

Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా కేవలం ఐదేండ్లలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేశారని, అందుకు బహుమానంగా ఆయనను జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. సాధువు, మహాత్ముని లాంటి సిసోడియాను జైలుకు పంపారు.. ఇందుకు మీరు సిగ్గు పడాలి అని వ్యాఖ్యానించారు.

Read Also: Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే

ఆదివారం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్‌ వసూలు చేస్తున్నదంటూ వచ్చిన ఆరోపణలను కేజ్రివాల్‌ ప్రస్తావించారు. సాధువు లాంటి మనీశ్‌ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సిబిఐ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సిసోడియాను మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ అంతకు ముందు ఆరోపించారు. జైల్లో సిసోడియాకు ఈ వేధింపులు తప్పడంలేదన్నారు.

Read Also: టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?

ఈడీ, సిబిఐ సంస్థలు కేంద్ర ఆదేశాలపై పని చేస్తున్నాయని, గత ఎనిమిదేళ్లలో ఇవి కనీసం మూడు వేలసార్లు దాడులు నిర్వహించాయని ఆయన అన్నారు. 95 శాతం దాడులు విపక్ష నేతలపైనే జరుగుతూ వచ్చాయన్నారు. త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల నేతలు తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ ఆప్‌ చీఫ్‌ కేజ్రివాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా తమ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాయచూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేజ్రివాల్‌ మాట్లాడారు.