Site icon NTV Telugu

Kejriwal : అందుకే పీఎం చదువుకున్న వాడై ఉండాలనేది : కేజ్రీవాల్

Pm Modi

Pm Modi

Kejriwal : రిజర్వు బ్యాంక్ ఇండియా నిన్న(శుక్రవారం) పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి జనాలకు ఝలక్ ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని నడిరోడ్డుపై నిలబెట్టేశారు. ఏటిఎంలలో నొట్లను మార్చుకునేందుక ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రధాని ఏమనుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అప్పుడు చలామణీలో ఉన్న రూ.1000 నోట్లతో అవినీతి పెరిగిపోయిందని.. అది బ్లాక్ మనీకి కారణమవుతుందని నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో ప్రధాని చెప్పిన దానికంటే పెద్దనోటు అంటే రూ.2000నోటును చెలామణిలోకి తీసుకొచ్చారు. తాజాగా మళ్లీ రూ.2000 నోటును రద్దు చేస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఎలా వదిలించుకోవాలా అని తలలు పట్టుకుంటున్నారు.

Read Also:Road accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

ఈ అనిశ్చిత పరిస్థితిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రూ.2000 నోటు రద్దు చేస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటన తరువాత దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ అందుకే చదువుకున్న వ్యక్తి ప్రధాని అయితే ఇటువంటి పరిస్థితులు రావు అన్నది అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అందుకే చదువుకోవాలని చెబుతున్నామని అన్నారు. ప్రధాని మోదీ విద్యార్హత గురించి కేజ్రీవాల్ ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Read Also:NTR 31: ఇది కదా మావా… ఫాన్స్ కి కావాల్సిన అనౌన్స్మెంట్

నిరక్షరాస్యుడైన మోదీకి ఎవరైనా ఏమైనా చెప్పగలరా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేస్తూ…2000నోటు తీసుకువస్తే అవినీతి ఆగిపోతుందని.. గతంలో నోట్ల రద్దుతో అవినీతి అంతమయ్యిందా అంటూ ప్రశ్నించారు. అందుకే ప్రధాని చదువుకోవాలని చెబుతున్నాం. నిరక్షరాస్యుడైన ప్రధాని, ఆయనకు ఏం చెప్పినా అర్థం కాదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Exit mobile version