NTR 31: ఇది కదా… ఫాన్స్ కి కావాల్సిన అనౌన్స్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి ‘దేవర’ టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. అల్లు అర్జున్ బ్లడీ బర్త్ డే బావా అంటూ ట్వీట్ చేసాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇలా మే 19 ఈవెనింగ్ నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికన్నా ఎక్కువగా, ముందు వచ్చిన అన్ని అప్డేట్స్ ని మరిపించే రేంజులో, ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యే రేంజ్ అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సోషల్ మీడియాలో హవోక్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆ అప్డేట్… ‘NTR31’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది.
KGF, సలార్ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్… మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్తనే చాలా పెద్ద విషయం. గత ఏడాది కాలంగా వినిపిస్తున్న ఈ న్యూస్ ని నిజం చేస్తూ లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున ‘ఎన్టీఆర్ 31’ ప్రాజెక్ట్ ఆన్ అయినట్లు ప్రకటన వచ్చింది. ఈ ఇయర్ లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాయి. అయితే కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమా డిలే అవ్వడం, ప్రశాంత్ నీల్ కూడా సలార్ సినిమా పనుల్లో ఉండడంతో ‘ఎన్టీఆర్ 31’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ కన్ఫ్యూజన్ కి ఎండ్ కార్డు వేస్తూ ‘ఎన్టీఆర్ 31’ సినిమా 2024 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పే ‘ఎన్టీఆర్ 31’ సినిమా షూటింగ్ నెక్స్ట్ మార్చ్ నుంచి అనే అప్డేట్ బయటకి రాగానే ఎన్టీఆర్ ఫాన్స్ స్కై హైలో ఉన్నారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున బయటకి వచ్చిన హ్యూజ్ కమర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.
Also Read
Team #NTR31 wishes @tarak9999 a very Happy Birthday 🔥🔥
On to the sets from March 2024 💥💥#HappyBirthdayNTR#PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/Mi769WTE2o
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2023
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!