NTV Telugu Site icon

Delhi Capitals : గుజరాత్ మ్యాచ్ కు అందుబాటులో రిషబ్ పంత్

Rishabh Pant

Rishabh Pant

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే మ్యాచ్ ఆడటానికి కాదండోయ్.. చూడటానికి మాత్రమే. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కాస్త లేచి తన పని తానే చేసుకోగలుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడతడిని.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటన్స్ మధ్య జరుగబోయే మ్యాచ్ కు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అతడు ప్రత్యేక్షంగా చూసేందుకు వస్తున్నాడు.

Read Also : Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే పుణ్యఫలం సిద్ధిస్తుంది..

ఈ మ్యాచ్ ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. రిషబ్ పంత్ ఈ సీజన్ కు దూరమవ్వడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ చూడటానికి పంత్ రాబోతున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ( డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ చెప్పారు.

Read Also : Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలుగుతాయి

గాయంతో బాధపడుతున్న రిషబ్ పంత్.. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని పంత్ నిర్ణయించుకున్నాడని ఆయన వెల్లడించారు. పంత్ ఫ్రాంఛైజీ యాజమానాల ప్రాంతం నుంచి మ్యాచ్ ను చూసే అవకాశం ఉందంట.. బీసీసీఐ అవినీతి నిరోధక, సెక్యూరిటీ టీమ్ ఒకే అంటే అతడు కొంత సమయం డగౌట్ లో కూడా గడుపుతుడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also : Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మారింది.. బ్లూ బర్డ్ స్థానంలో…

పంత్ ను ఇంటి నుంచి తీసుకురావడం.. తిరిగి డ్రాప్ చేయడంతో పాటు స్టేడియంలోనూ డగౌట్ వరకు ప్రత్యేకమైన ర్యాంప్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓకే చెప్పడంతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. పంత్ ఆడకపోయినా.. స్టేడియానికి వచ్చి తమతో పాటు డగౌడ్ లో కూర్చుంటే బాగుంటుందని మొదటి నుంచి హెడ్ కోచ్ పాంటింగ్ అన్నారు.