Delhi Capitals Captain Rishabh Pant Nearing One Match Ban in IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రెండోసారి జరిమానా పడింది. బుధవారం విశాఖలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి కాబట్టి పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా పడింది. అలానే జట్టులోని ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జరిమానా పడింది.
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించాం. పంత్‌తో పాటు జట్టులోని మిగిలిన సభ్యులకూ ఫైన్ విధించాం. మ్యాచ్‌లో ఆడిన ఇంపాక్ట్ ప్లేయర్‌కూ ఇది వర్తిస్తుంది. జట్టులోని ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం (ఈ రెండింట్లో ఏది తక్కువైతే) జరిమానాగా విధించాం’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ 2024లో ఈ తప్పిదం మరోసారి రిపీట్ అయితే మాత్రం.. పంత్ జరిమానాతో పాటుగా ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: Motorola Edge 50 Pro Price: భారత్‌లో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ లాంచ్.. సూపర్ లుక్, అద్భుత ఫీచర్స్!
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఓ సీజన్‌లో మొదటిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా పడుతుంది. రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్‌కు రూ. 24 లక్షలు ఫైన్, జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి అదే తప్పు పునరావృతమైతే కెప్టెన్‌కు 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా పడుతుంది.