Site icon NTV Telugu

DC vs GT: కష్టాల్లో ఢిల్లీ.. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఇలా..

Delhi Capitals

Delhi Capitals

DC vs GT: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. తొలుత టాస్‌ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టన్‌ హార్దిక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన ఢిల్లీ 10 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్‌లు రెండేసి వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టారు. ఢిల్లీ 10 ఓవర్లలో 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ 10 ఓవర్లలోనే నలుగురు కీలక ఆటగాళ్లు ఔట్ కాగా.. మంచి స్కోరు చేసేందుకు ఢిల్లీ పోరాడుతోంది.

Read Also: IPL 2023: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్‌ ఐపీఎల్ నుంచి ఔట్

షమీ తన అద్భుతమైన బౌలింగ్‌తో మిచెల్‌ మార్ష్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి రెండో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు పృథ్వీ షా(7 పరుగులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కీలక ఆటగాళ్లైన ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్, రిలీ రోసో వికెట్లు అల్జారీ జోసెఫ్‌ తన బుట్టలో వేసుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్ వార్నర్ 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Exit mobile version