Site icon NTV Telugu

Dc Vs Kkr : చెలరేగిపోతున్న ఢిల్లీ బౌలర్లు.. వరుస వికెట్లు కోల్పోతున్న కేకేఆర్

Kkr

Kkr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ కాస్త లేట్ అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ వరుస వికెట్లు కోల్పోయింది.అయితే కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ లిటన్ దాస్ ( 4 ) ముఖేశ్ కుమార్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిపోయాడు.

Also Read : Ramabanam Triler: వీడు తమ్ముడులా లేడు టెర్మినేటర్ లా ఉన్నాడు

దీంతో ఫస్ట్ డౌన్ వచ్చిన వెంకటేశ్ అయ్యర్ డకౌట్ గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్ లో షాట్ కు యత్నించిన అయ్యర్ స్లిప్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ బాట పట్టాడు. 29 పరుగుల వద్ద రెండో వికెట్ ను కేకేఆర్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కూడా ఔట్ అయ్యాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. 39 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ 34 పరుగులతో కొనసాగుతుండగా
అక్షర్ పటేల్ బౌలింగ్ లో మన్ దీప్ సింగ్ ( 12), రింకు సింగ్ (6) ఇద్దరు ఔట్ అయ్యారు. ఇక ఇషాంత్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ట్రై చేసి సునీల్ నరైన్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు బాటపట్టాడు.

Also Read : Body Of Missing Indian: మేరీల్యాండ్‌లో మిస్సింగ్.. భారతీయ ఇంజనీర్ మృతదేహం లభ్యం

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, , ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్ట్జే, కుల్ దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవలని పట్టుదలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన ఢిల్లీ.. అందుకు తగ్గట్టుగానే బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. అటూ కేకేఆర్ కూడా పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు అయితే కేకేఆర్ బ్యాటర్లు అచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. 12 ఓవర్లలో 70 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

Exit mobile version