Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో షాహీన్ పొరుగువారిని, ఆమె సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ మాడ్యూల్ పై దర్యాప్తు ఇప్పుడు పర్వేజ్ పై అనుమానం కలిగించింది.
READ MORE: Jigris Movie Review: జిగ్రీస్ మూవీ రివ్యూ.. హీరోయిన్, గ్లామర్ డోస్ లేని సినిమా ఎలా ఉందంటే?
జమ్మూ కశ్మీర్ పోలీసులు పర్వేజ్‌ను విచారణ కోసం ఫరీదాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రాథమిక దర్యాప్తులో తీవ్రవాద భావజాలం, ఉగ్రవాద సంబంధాల సంకేతాలు వెల్లడయ్యాయి. పర్వేజ్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, హార్డ్ డ్రైవ్‌లకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్ష కొనసాగుతోంది. పర్వేజ్ కు ఫరీదాబాద్ కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ మాడ్యూల్ తో సంబంధం ఉండవచ్చని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. పర్వేజ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), జమ్మూ కశ్మీర్ పోలీసుల సమాచారం ఆధారంగా అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
READ MORE: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్… కేసు నమోదు చేసిన పోలీసులు
