NTV Telugu Site icon

Delhi Liquor Scam: బాహు’బలి’ మనీష్ సిసోడియా.. ఆప్‌పై బీజేపీ మీమ్‌ వైరల్

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో ఆప్‌పై దాడి చేసేందుకు బీజేపీ సరికొత్తగా బాహుబలి చిత్రంలోని కొన్ని క్లిప్‌లను వినియోగించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం. అతడిని ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. బాహుబలి చిత్రంలో ఓ చావడిలో గల క్లిప్‌లో కథానాయకుల ముఖాలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముఖాలను కనిపించేలా వీడియో క్లిప్‌ను బీజేపీ రూపొందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. బాహుబలి చిత్రం నుంచి ఒక నిమిషం నిడివి ఉన్న క్లిప్‌లో, మనీష్ సిసోడియా ముఖం ఒక చావడి వద్ద మద్యం అందిస్తున్న వ్యక్తిగా ఆ వీడియోను క్రియేట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అక్కడి వెళ్లి మద్యం అడిగినట్లుగా బాహుబలి చిత్రంలోని వీడియో క్లిప్‌ను సృష్టించారు. ఆ సీన్‌లో సిసోడియా డబ్బు అడుగుతుండగా, కేజ్రీవాల్ మొత్తం చావడి కోసం పానీయాలు కొనడానికి తన వద్ద తగినంత డబ్బు ఉందని చెబుతూ బంగారు నాణేల కుప్పను విసిరేస్తున్నాడు.

Boora Narsaiah Goud: హత్యల్లో తెలంగాణ బీహార్‌ను మించిపోయింది

ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు ఈ వీడియోను లింక్ చేసినట్లుగా క్లిప్‌ను క్రియేట్ చేశారు. క్వాప్షన్‌ను ఇలా రాసుకొచ్చారు. ‘మద్యం కుంభకోణం సూత్రధారి కేజ్రీవాల్’ అనే క్యాప్షన్‌ను జోడించారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని, దర్యాప్తు అధికారులకు సహకరించలేదని అరెస్టు అనంతరం సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆప్‌ ఈ అరెస్ట్‌ను దుష్ట రాజకీయం అని పేర్కొంది. అయితే బీజేపీ ఈ చర్యను ప్రశంసించింది. మనీష్ సిసోడియా మంగళవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.