Delhi BJP Chief Reign: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల(ఎంసీడీ)లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వచ్చిన సూచనల మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యాక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నారు.
Read Also: Bandi sanjay: మహిళ కావడంతోనే ఇంటికి వెళ్లి సీబీఐ విచారణ చేస్తున్నారు
బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్‌గా 2020 జూన్‌లో ఆదేశ్ గుప్తా నియామకమయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) పరిధిలోని మొత్తం 250 వార్డులకు గత ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో 15 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ… ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా.. కేజ్రీవాల్ పార్టీకి 134 స్థానాలు వచ్చాయి. బీజేపీ 104 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుపొందాయి. 3 సీట్లను స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. మెజారిటీ సాధించకపోయినప్పటికీ… మేయర్ ఎన్నికకు బీజేపీ పోటీ పడతుందని వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను ఆదేశ్ గుప్తా కొట్టి పారేశారు. మేయర్ పదవి ఆప్ చేపడుతుందని సమాచారం.