Instagram: ప్రస్తుత సమాజంలో ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విటర్ లాంటివి ఉపయోగించడంలో చాలా బిజీ అయిపోయారు. అయితే, వాటిని తమ పరిధి వరకు మాత్రమే వినియోగించాలి.. కానీ అది కాస్తా, ఎక్కువ అయితే, మాత్రం తీవ్ర అనర్థాలు ఎదుర్కొవల్సి వస్తుంది.. తాజాగా, కర్ణాటక రాష్ట్రంలో తన పెళ్లం ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయిందనే ఆవేదనతో భర్త సూసైడ్ చేసుకున్నారు. అయితే, తన భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంపై ఉన్న వ్యామోహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు భర్త కుమార్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టింది.. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతుండటంతో మనస్తాపం చెందిన భర్త హనురూలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
Read Also: Bonthu Rammohan: నేడు కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..
కాగా, కూలీగా పని చేస్తున్న కుమార్‌కు తన భార్య సోషల్ మీడియాలోనే ఎక్కువ సేపు గడపడంతో పాటు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె తరచూ రీల్స్ చేస్తుండేది అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆమె పట్టించుకోవడం లేదనే బాధలో అతడు సూసైడ్ చేసుకున్నాడుని పేర్కొన్నారు. అయితే, ఘటనా స్థలం దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.