Site icon NTV Telugu

Rajnath Singh: రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలి..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలని, భారత వైమానిక రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం టాప్ కమాండర్లను కోరారు. కార్యాచరణ సంసిద్ధతను బలోపేతం చేయడంపై ఉద్ఘాటిస్తూ, వైమానిక యుద్ధభూమిలో కొత్త పోకడలు ఉద్భవించినందున, భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, డ్రోన్ల వాడకంపై వైమానిక దళం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఎయిర్ ఫోర్స్ కమాండర్ల రెండు రోజుల సదస్సు ప్రారంభ సెషన్‌లో రక్షణ మంత్రి ప్రసంగించారు. “గ్లోబల్ సెక్యూరిటీ దృష్టాంతంలో కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి” అని ఆయన అన్నారు. హమాస్-ఇజ్రాయెల్ వివాదం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వివిధ ఎయిర్‌క్రాఫ్ట్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంపై ఎయిర్ ఫోర్స్ కమాండర్ సమగ్ర విశ్లేషణను ఈ సదస్సులో నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Also Read: Israel-Hamas War: ఇజ్రాయిల్ దాడుల్లో 50 మంది బందీలు చనిపోయారు.. హమాస్ ప్రకటన..

చైనా సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్‌ చౌదరి, ఇతర కమాండర్లు కూడా చైనాతో సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా లడఖ్ సెక్టార్‌లో PLA వైమానిక దళం ద్వారా వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడం గురించి సమీక్ష నిర్వహించారు.

Exit mobile version