GT vs MI: ముంబయి జోరు కొనసాగేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs MI: ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పంజాబ్‌పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది. ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకేందుకు ప్రయత్నించనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడడం గమనార్హం.
గుజరాత్, ముంబయి జట్లు రెండూ కూడా బలంగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ కేమెరూన్ గ్రీన్‌లు విజృంభిస్తే ముంబై ఇండియన్స్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రావడంతో జట్టుకు అదనపు బలం చేకూరింది. జోఫ్రా ఆర్చర్ పంజాబ్‌పై జరిగిన గత మ్యాచ్‌లో సామ్ కుర్రాన్‌ను అవుట్ చేసి ఈ ఐపీఎల్లో తన తొలి వికెట్‌ను నమోదు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ఫిట్నెస్ సమస్యల కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతని రాకతో ముంబై బౌలింగ్ బలం పెరిగింది. వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా గొప్పగా రాణిస్తున్నాడు. ముంబై జట్టు గుజరాత్‌పై గెలిచి రెండు కీలక పాయింట్లను సాధించాలనే పట్టుదలతో ఉంది.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
మరోవైపు లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించి ఊపు మీదున్న గుజరాత్ జట్టు.. ముంబైపై గెలిచి పాయింట్ల పట్టికలో కీలక స్థాయికి చేరాలని ప్రయత్నిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్లకు అనుభవజ్ఞుడైన స్పీడ్‌స్టర్ హార్దిక్ పాండ్యా జట్టుకు కీలకమైన, సమయానుకూల పురోగతులను అందించడమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్‌తో ప్రభావం చూపుతున్నాడు. మరో బౌలర్ మోహిత్ శర్మ కూడా బాగా రాణిస్తుండడంతో గుజరాత్ జట్టు బలంగా కనిపిస్తోంది. లక్నోపై విజయం సాధించేందుకు, తన జట్టును గట్టెక్కించడానికి హార్దిక పాండ్యా 66 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు అతిపెద్ద సానుకూలాంశాలలో ఒకటి. ముంబైపై విజయం సాధించాలని గుజరాత్ పట్టుదలతో ఉంది. ఏ జట్టు గెలుస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గుజరాత్ జట్టు(అంచనా): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ
ముంబై జట్టు(అంచనా): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!