NTV Telugu Site icon

Defence Minister Rajnath Singh: దేశ భద్రత, రక్షణ విషయంలో కలిసి ముందుకెళ్లాలి..

Rajnath Singh

Rajnath Singh

Defence Minister Rajnath Singh: ఈ ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించడం హర్షణీయమని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌కి రాజ్‌నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశం భద్రత, రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం లేదని అన్నారు.

Read Also: Navy Radar Station: దామగుండంలో నెవీ రాడార్‌ స్టేషన్‌.. శంకుస్థాపన చేసిన రాజ్‌ నాథ్‌ సింగ్‌, రేవంత్ రెడ్డి

దేశ బలమైన భద్రత కోసం ఈ రకమైన స్టేషన్లు మన దేశానికి అత్యంత ముఖ్యమైనవని వ్యాఖ్యానించారు. పూర్వం కమ్యూనికేషన్, సమాచారం కోసం ఈగల్, ఇతర పక్షులను ఉపయోగించామన్నారు. ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉపయోగిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గత ముప్పై సంవత్సరాల నుంచి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. దేశం బలమైన మిలిటరీని నిర్మించడానికి కట్టుబడి ఉందన్నారు. కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ గురించి తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తున్నారని.. పర్యావరణానికి నష్టం జరిగిందని అంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగించదని చెబుతున్నానని ఆయన వెల్లడించారు. కొంతమందికి తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. దేశ రక్షణ, భద్రత విషయంలో కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

 

Show comments