Site icon NTV Telugu

Mahavatar: మరో భారీ ప్రాజెక్ట్‌కు.. దీపికా పదుకొణె గ్రీన్ సిగ్నల్..?

Mahavathar, Vikey Deepika Padukune

Mahavathar, Vikey Deepika Padukune

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైన దీపిక.. ఇప్పుడు మైథలాజికల్‌ ప్రాజెక్ట్‌ ‘మహావతార్’ ‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

Also Read : Nayanam Trailer : వరుణ్ సందేశ్.. ‘నయనం’ ట్రైలర్

లేటెస్ట్‌గా ‘స్త్రీ 2’తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు, నిర్మాత అమర్‌ కౌశిక్‌.. ఇప్పుడు విక్కీ కౌశల్‌ తో ‘మహావతార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరశురాముడి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలోకి దీపికను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ విషయంపై ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్లు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. మూవీ యూనిట్ అభిప్రాయం ప్రకారం, ఈ సినిమాలో దీపిక పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందట. ఆ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేస్తుందని టీమ్ నమ్ముతోంది. అందుకే ఆమెతో చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా, దర్శకుడు అమర్ కౌశిక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ..

దాదాపు ఆరు నెలల నుంచి దీని ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, ఇది తనకెంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ ఎందుకంటే..నేను అరుణాచల్‌ ప్రదేశ్‌లోని స్కూల్‌లో చదువుకునేటప్పుడు, మాకు దగ్గరలోనే పరశురామ్‌కుండ్‌ ఉండేది. నేను మా అమ్మని తరచూ పరశురాముడు ఎవరని అడిగేవాణ్ణి. ఆయన చాలా కోపంగా ఉంటాడని మాత్రమే నాకు చెప్పేవారు. అందుకే ఆ పాత్ర నన్ను బాగా ఆకర్షించింది. ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించడంలో నాకు మంచి పట్టు వచ్చింది, అదే ఈ సినిమాను ప్రారంభించడానికి నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తారు అనడంలో సందేహం లేదు.

Exit mobile version