Site icon NTV Telugu

Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!

Adivisesh

Adivisesh

Dacoit: వరుస సినిమాలతో, విభిన్నమైన కథలతో సక్సెస్ అందుకుంటున్న యంగ్ హీరో అడివి శేష్. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ఈ సక్సెస్‌ఫుల్ హీరో, ఏ సినిమా చేస్తున్న అది హిట్ సాధిస్తుందనే నమ్మకం సగటు సినిమా ప్రేమికుల్లో ఏర్పడిందంటే అది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కొత్త సినిమా డెకాయిట్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO: Assembly Election Voting: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జోరు.. భారీగా ఓటింగ్ నమోదు.!

ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం గూఢచారి 2. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ విడుదలపై వస్తున్న వార్తలకు తాజాగా అడివి శేష్ ఫుల్ స్టాప్ పెట్టారు. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ‘G2’ మరో మూడు నెలల్లోనే థియేటర్లలోకి వస్తుందని సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకు ఈ యంగ్ హీరో తాజాగా చెక్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని, భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండటంతో అవన్నీ పూర్తి చేసుకొని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో చేస్తామని శేష్ స్పష్టం చేశారు. క్యాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తన బాలీవుడ్ ఎంట్రీ గురించి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో ‘మేజర్’ సినిమా సూపర్ హిట్ కావడంతో హిందీలో ఆయనకు ఏకంగా ఆరు భారీ ఆఫర్లు వచ్చాయట. అయితే వాటిని శేష్ సున్నితంగా తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనకు వచ్చిన ఆరు ఆఫర్లలో నాలుగు వార్ మూవీస్ కాగా, రెండు బయోపిక్‌లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒకే రకమైన పాత్రలకు లేదా జోనర్లకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే వాటిని వద్దనుకున్నట్లు తెలిపారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తీసిన ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఆ సినిమా తనకు సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. అది పూర్తయిన తర్వాత మళ్లీ అటువంటి జోనర్ల జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో యుద్ధ సినిమాలు లేదా బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ‘G2’ పైనే ఉందని, ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

READ ALSO: Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

Exit mobile version