December 9th Incarnation Festival: నేటి (సోమవారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానుంది. కాగా..సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదు నుంచి ఏడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. తొలి రోజు సమావేశంలోనే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు విగ్రహం రూపకల్పన తదితర అంశాలపైనా ప్రకటన చేస్తారు. అనంతరం ఆ ప్రకటనపై సభలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్!
2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజును పండుగలా జరుపుకోవాలని నిర్ణయించింది. కాగా.. తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంపై ముఖ్యమంత్రి సమావేశం తొలిరోజే కీలక ప్రకటనతోపాటు విగ్రహ రూపకల్పన తదితర అంశాలపై ప్రకటన వెలువడనుంది. అనంతరం ప్రకటనపై సభలో చర్చ జరగనుంది. చర్చ అనంతరం తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత సచివాలయంలో జయజయహే తెలంగాణ గీతాలాపన మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. విగ్రహ శిల్పి రమణారెడ్డిని, గీత రచయిత జయ జయహేను సన్మానించనున్నారు. ఈ సందర్భంగా గద్దర్, గూడ అంజన్న వంటి కళాకారుల త్యాగాలకు గుర్తుగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.
Pushpa 2 : పుష్ప -2 లేటెస్ట్ టికెట్ ధరలు ఇవే.!