NTV Telugu Site icon

Kerala: వయనాడ్‌ ఘటనలో 122 చేరిన మృతుల సంఖ్య..

Wayanad

Wayanad

కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు. మరోవైపు.. ముండకై తేయాకు పరిశ్రమలో పనిచేస్తూ గల్లంతైన 600 మంది కార్మికుల కోసం ఆర్మీ అధికారులు గాలిస్తున్నారు. వారంతా అస్సాం, పశ్చిమబెంగాల్ నుండి వచ్చి తేయాకు తేటలో పనిచేస్తున్నారు. వయనాడ్లో భారీ ప్రళయం ధాటికి ‘టీ ఎస్టేట్’ పూర్తిగా కొట్టుకు పోయింది.

Read Also: Jio Plans: జియో 3 కొత్త చౌకైన ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీలు కూడా..

వయనాడ్‌కు విపత్తు సహాయ బృందాన్ని పంపింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కార్యాలయం (కేరళ, మాహే).. ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ బేపూర్ విపత్తు సహాయ బృందాన్ని పంపాయి. విపత్తులో ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి వీరు అక్కడికి వెళ్లారు. ఈ బృందంలో అత్యంత శిక్షణ పొందిన ICG సిబ్బంది.. ప్రత్యేక వైద్య బృందం ఉంటుంది. ఈ బృందం అవసరమైన విపత్తు సహాయక సామగ్రిని కలిగి ఉంది. ఇందులో రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం రబ్బరు పడవలు, నీరు.. డ్రైనేజీ సమస్యలను నిర్వహించడానికి డీజిల్‌తో నడిచే పంపులు, భద్రత కోసం లైఫ్ జాకెట్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సిబ్బందిని రక్షించడానికి రెయిన్‌కోట్లు.. గమ్ బూట్‌లు, మట్టిని తొలగించే పరికరాలు అందుబాటులో ఉన్నాయి .

Read Also: Amalapuram: ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

మరోవైపు.. వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. కేరళలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వయనాడ్, కోజికోడ్, మల్లాపురం, ఒపాలక్కాడ్, ఇడిక్కి సహా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కేరళలో భారీ వర్షాల ధాటికి డ్యాంలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారిపోయాయి.