Convicts Escape : అచ్చం సినిమాల్లో లాగే పక్కా ప్లాన్ వేశారు.. ఎస్కేప్ అయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Convicts Escape : ఉరిశిక్ష పడిన ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీ ఫక్కీలో తప్పించుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వారిని ఛేజ్ చేయడానికి అధికారుల పెద్ద టీం ఇప్పుడు బయలుదేరింది. అచ్చం సినిమాల్లో లాగే దుండగులు కోర్టునుంచి తరలిస్తున్న క్రమంలో తప్పించుకున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కోర్టు వద్ద జరిగింది. ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్‌ల హత్య కేసుల్లో అన్సురుల్లా బంగ్లా టీం ఉగ్రవాద సంస్థకు చెందిన మెయినుల్ హసన్ షమీమ్, అబు సిద్ధిఖ్ సోహెల్‌లకు గతేడాది కోర్టు మరణశిక్ష విధించింది. వేరే కేసుల్లోనూ నిందితులైన వీరిని విచారణ కోసం ఢాకా కోర్టుకు తీసుకొచ్చారు.
Read Also: BigBoss Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ బ్యూటీ… పెళ్లి కొడుకు ఎవరంటే
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
అనంతరం వారిని తిరిగి జైలుకు తరలించేందుకు తీసుకురాగా కోర్టు బయట అప్పటికే కొందరు బైకులపై వచ్చిన వ్యక్తులు ఎస్కార్టు పోలీసులపై కెమికల్ స్ప్రే చల్లి బైకులపై ఎక్కించుకుని వెళ్లారు. ఎస్కార్టు పోలీసులపై రసాయనాలు స్ప్రే చేయడంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి. అంతే కాకుండా ఆ ప్రాంతం నిండా పొగ కమ్ముకుంది. ఖైదీలతో సహ వచ్చిన వారు వచ్చినంత వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. హై ప్రొఫైల్ హత్య కేసుల్లోని దోషులను సాధారణ ఖైదీల్లా ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులతో కోర్టుకు పంపడం ఏంటని కోర్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీల చేతులకు మాత్రమే సంకెళ్లు వేశారని అంటున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోవడంతో దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ కమల్ తెలిపారు. కాగా, ఉగ్రవాదులు ఫిబ్రవరి 2015లో అవిజిత్ రాయ్‌ను హతమార్చారు. అదే ఏడాది నవంబరులో డిపన్కు కూడా హత్యచేశారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!