NTV Telugu Site icon

Sister Dead Body On Bike : సూసైడ్ చేసుకున్న చెల్లె.. మృతదేహాన్ని బండిపై తీసుకెళ్లిన అన్న

New Project (7)

New Project (7)

Sister Dead Body On Bike : పరీక్ష సరిగా రాయలేదని చెల్లెలు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఎలాగోలా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. తిరిగి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అన్న తన చెల్లెలి మృతదేహాన్ని బైక్ పై 10కిలోమీటర్లు తీసుకెళ్లిన మానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కౌశంబి జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో 17 ఏళ్ల నిరాషా దేవి ఇంటర్ పరీక్షలు సరిగ్గా రాయలేదు.. ఫలితాల్లో మార్కులు మంచిగా రావంటూ ఆందోళనకు గురైంది. ఆహారం తీసుకోవడం మానేసింది.. అంతేకాదు ఇంట్లో ఒంటిరిగా ఉన్న టైములో ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ట్రీట్మెంట్ నిమిత్తం మంజన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే నిరాషా చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

Read Also: 12Pages : 12పేజీల సూసైడ్ నోటు.. చదివితే షాకింగ్ విషయాలు

చెల్లెలు మృత దేహాన్ని ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళడానికి అంబులెన్స్‌ ఏర్పాటుచేయాలని హాస్పిటల్ సిబ్బందిని అన్న కుల్దీప్ కోరాడు. అరగంటకు పైగా ఎదురు చూసినా అంబులెన్స్ దొరక్కపోవడంతో మృతురాలి సోదరుడు ఆమె మృతదేహాన్ని బండి పైనే దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి చేరుకున్న అనంతరం కుటుంబీకులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో కుటుంబీకులు హాస్పిటల్ అధికారులతో తగువుకు దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంజ్‌పూర్ పోలీసులు హాస్పిటల్ కి చేరుకుని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘటనపై దర్యాప్తుకు చేస్తామని.. దర్యాప్తు ఆధారంగా అధికారులపై తగిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.