Site icon NTV Telugu

Kerala: కేరళలో విషాదం.. ఒకే ఇంట్లో లభించిన ఐదు మృతదేహాలు

Crime

Crime

Kerala: కేరళలోని కన్నూర్‌లో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ముగ్గురు చిన్నారుల మృతదేహాల్లో రసాయనాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక విచారణలో పిల్లలు నిద్రమాత్రలు వేసుకుని చనిపోయారని తేలింది. అయితే శరీరంలో దొరికిన పదార్థం విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్షించాలని నిర్ణయించారు. మృతులను షాజీ (42), భార్య శ్రీజ (38), శ్రీజ పిల్లలు సూరజ్ (12), సుజిన్ (8), సుర్భి (6)గా గుర్తించారు.

Read Also: Tiger Vs Pathaan: ఈ కాంబినేషన్ కోసం ఎంత పెట్టినా తక్కువే…

షాజీ, శ్రీజ గదిలో వేలాడుతుండగా.. మెట్లపై పిల్లల మృతదేహాలు కనిపించాయి. మీడియా కథనాల ప్రకారం.. శ్రీజకు షాజీ రెండో భర్త. శ్రీజ బుధవారం ఉదయం 6 గంటలకు చెరుపుజ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పిల్లలను చంపేస్తానని చెప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వారందరూ చనిపోయారు. అయితే వెంటనే వైద్యులను పిలిపించారు. వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు సూరజ్ శరీరంపై తీవ్ర గాయాలైన ఆనవాళ్లు ఉన్నాయి. శ్రీజకు షాజీ రెండో భర్త. చిన్న పిల్లలపై ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. షాజీ, శ్రీజ ఒకే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు.

Read Also:Ashwini Vaishnaw: పుష్కర్ సింగ్ ధామితో అశ్విని వైష్ణవ్.. కుల్ఫీ తింటూ చిక్కాడుగా..

Exit mobile version