NTV Telugu Site icon

Hyderabad: ఆర్మీ కాలేజీలో చొరబడ్డ ఆగంతకులు.. టెర్రరిజం కోణంపై స్పష్టత ఇచ్చిన డీసీపీ..!

Dcp Reshmi Parimal

Dcp Reshmi Parimal

ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్ లో మిలట్రీ ఆర్మీ ఏరియాల ఉన్నాయని.. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీడియా సంయమనం పాటించాలన్నారు.

READ MORE: Euphoria: తల్లిదండ్రులు త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా: భూమిక చావ్లా

“ఈ కేసులో ఎలాంటి టెర్రరిజం కోణం లేదు. ఆశిష్ కుమార్ అనే వ్యక్తి బీహార్ వాసి ఇతన్ని విచారిస్తున్నాం. ఇతను హైదరాబాదులో వర్క్ చేస్తున్నాడు. ఆశిష్ గతంలో క్యాంటీన్ నడిపేవాడు. ఆశిష్ తో పాటు ఆర్మీ కాలేజ్ లో వచ్చిన ముగ్గురిని మోసం చేసి ఆర్మీ కాలేజ్ క్యాంటీన్లో ఉద్యోగం పెట్టిస్తాను అనీ ఆశిష్ చిట్ చేశాడు. ముగ్గురు దగ్గర కమీషన్ తీసుకున్నాడు. ఆర్మీ కాలేజ్ లో ఫొటోస్ తీస్తుండగా ఆర్మీ వాళ్ళు పట్టుకున్నారు. గతంలో ఇలాగే బీహార్ లో మిలటరీ ఏరియాలో చొరబడ కేసు నమోదు అయింది. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. ఇలాంటి కేసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు మీడియా పోలీసులకు సహకరించాలి.” అని నార్త్ జోన్ డీసీపీ రేష్మి వెల్లడించారు.

READ MORE: Saeed Abbas Araghchi: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు