Site icon NTV Telugu

DCP Padmaja: ఉప్పల్‌లో ఈ నెల 21న జరిగిన హత్య కేసును చేధించిన పోలీసులు

Dcp Padmaja

Dcp Padmaja

ఉప్పల్‌లో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదర్శ్ నగర్ లో ఈ నెల 21 వ తేదీన సాయికుమార్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 22 వ తేదిన సాయి కుమార్ చనిపోయాడు. అయితే నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుల మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన జరిగిన మర్డర్ కేసును చేధించామని, వరుసకు మరదలు అయ్యే మహిళను లైంగికంగా వేధించడమే కాక ఆమె కూతుళ్ళను వేధించడమే హత్యకు కారణమని ఆమె పేర్కొన్నారు. శారద ఆమె బంధువులు కత్తితో దాడి చేసినట్లు గుర్తించామని, హత్య కేసును చేధించేందుకు మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. సంఘటనా స్థలంలో కారంపొడి తో పాటు రక్తపు నమూనాలను సేకరించామని, సంఘటనకి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లను సేకరించామని ఆమె తెలిపారు.
Anudeep: తొలిసారిగా చెప్పులేసుకుని షాకిచ్చిన అనుదీప్.. ఇదేందయ్యా ఇది

శారద అనే మహిళ హత్యకు గురైన సాయికి మరదలు వరుస అవుతుందని, భర్త చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు తో కలిసి ఉంటుందన్నారు. ఈమెను సాయికుమార్ వేధింపులకు గురి చేస్తుండేవాడని, ఈ వేధింపులు భరించలేక సాయికుమార్ పై గతంలో పోలీసులకు శారత ఫిర్యాదు చేసిందని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ సాయిలో మాత్రం మార్పు రాలేదని, శారదతో పాటు ఆమె ఇద్దరు ఆడ పిల్లలపై సాయికుమార్ కన్నేశాడని, దీంతో సాయికుమార్ కి ఎలాగైన బుద్ధి చెప్పాలని అనుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శారదకు సమీప బంధువు పాత నేరస్తుడైన దీపక్ కు విషయం చెప్పిందని, శారద, దీపకుమార్, బాలకృష్ణ మరో వ్యక్తి కలిసి పక్క ప్లాన్ ప్రకారం సాయికుమార్ పై దాడి చేశారని ఆమె వెల్లడించారు. సాయికుమార్ కళ్లల్లో శారద కారంపొడి కొట్టిగా, దీపక్‌ మిగతా వాళ్ళు అతనిపై కత్తులతో దాడి చేశారని, కత్తిపోట్లకు గురైన మరుసటి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి చనిపోయాడని డీసీపీ పద్మజ తెలిపారు.

Peddireddy Ramachandra Reddy: టీడీపీకి అభ్యర్థులు దొరక్క కష్టపడి జాబితా విడుదల..! 150కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం

Exit mobile version