NTV Telugu Site icon

Jadcherla MLA: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన జడ్చర్ల డీసీఎం అసోసియేషన్.. పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని హామీ

Laxmareddy

Laxmareddy

Jadcherla MLA: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని తన ప్రచార జోరును పెంచారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు ప్రచారంలో ముందుకెళ్తుండగా, మరోవైపు పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని జడ్చర్ల డీసీఎం అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని.. రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు. అందుకోసం పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Pawan Kalyan: వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు జనసేనలో తావు లేదు.

అంతకుముందు నవాబుపేట్ మండలంలోని చెన్నారెడ్డి పల్లె, కేశవరావు పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, దాదాపు 40 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తైతే బీఆర్ఎస్ కు పేరొస్తదని కాంగ్రెసోళ్ల అక్కసని విమర్శించారు. ఇన్నాళ్లు కేసులేసి ఆలస్యం చేసింది వారేనని దుయ్యబట్టారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు బంగారు తునక అయిందని అన్నారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ పూర్తైతే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు.

HD Kumaraswamy: సీఎం, డిప్యూటీ సీఎం మద్దతు పాకిస్తాన్‌కా, ఆస్ట్రేలియాకా..? కుమారస్వామి విమర్శలు..