ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని తన ప్రచార జోరును పెంచారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు ప్రచారంలో ముందుకెళ్తుండగా, మరోవైపు పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని జడ్చర్ల డీసీఎం అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని..…