Site icon NTV Telugu

DC vs RCB: త్రుటిలో స్మృతి మంధాన సెంచరీ మిస్.. వరుస విజయాలతో ఆర్సీబీ దూకుడు..!

Dc Vs Rcb Wpl 2026

Dc Vs Rcb Wpl 2026

DC vs RCB: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను నమోదు చేస్తుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్‌.. డీఎల్‌ఎస్‌ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..!

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ చెలరేగి 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఢిల్లీకి మంచి ఆరంభం ఇచ్చింది. అయితే ఆరంభంలోనే లిజెల్ లీ, లారా వోల్వార్డ్, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్ వరుసగా ఔట్ కావడంతో కేవలం 10 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. వీరి తర్వాత కష్టసమయంలో లూసీ హామిల్టన్ 19 బంతుల్లో 36 పరుగులు, స్నేహ్ రాణా (22) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో శ్రీఛరణి నాటౌట్‌గా 11 పరుగులు జోడించడంతో ఢిల్లీ 166 పరుగుల స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్, సయాలీ సాత్గారే చెరో మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించారు.

Dhurandhar: ఆరు వారాలైనా తగ్గని ‘ధురంధర్’ దూకుడు.. 43వ రోజు భారీ కలెక్షన్స్!

ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆరంభంలో గ్రేస్ హారిస్ వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత స్మృతి మంధాన తనదైన స్టైలిష్ బ్యాటింగ్ తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. స్మృతి 61 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీ త్రుటిలో తప్పించుకుంది. అయినా స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఇక స్మృతితో కలిసి జార్జియా వోల్ 42 బంతుల్లో 54 పరుగులు నాటౌట్‌గా చేసి రెండో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో రిచా ఘోష్ 7 పరుగులు చేయడంతో 18.2 ఓవర్లలోనే ఆర్సీబీకి విజయాన్ని అందించింది.

Exit mobile version