Site icon NTV Telugu

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. సెహ్వాగ్ ను అధిగమించి టాప్ 5లోకి ఎంట్రీ

Warner

Warner

David Warner: టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా.. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన వార్నర్‌.. ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

Read Also: Aliya Baig Academy: వైభవంగా అలియా బేగ్ అకాడమీ ఆఫ్ మేకప్ విద్యార్థుల కాన్వకేషన్

ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన వార్నర్‌ ఓపెనర్‌గా 8,208 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్నర్‌ అధిగమించాడు. ఒక్క పరుగు తేడాతో సెహ్వాగ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో సెహ్వాగ్‌(8,207) ఐదో స్ధానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌తో ఆ స్ధానాన్ని డేవిడ్‌ భాయ్‌ కైవసం చేసుకున్నాడు.

Read Also: Dimple Hayathi : ఆ భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన డింపుల్ హయతి…?

ఇ‍క ఓవరాల్‌గా టెస్ట్ మ్యాచ్ ల్లో ఓపెనర్ గా ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్లలో..ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలస్టర్ కుక్(11, 845) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(9,607), గ్రేమ్‌ స్మిత్‌(9,030), మథ్యూ హేడన్‌(8,625) పరుగులతో ఉన్నారు.

Exit mobile version