David Warner: “పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు”.. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ (Australian Cricket)లో ఎనిమిదేళ్ల నాటి బాల్ ట్యాంపరింగ్ వివాదం (Ball-Tampering Scandal) మళ్లీ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. శాండ్‌పేపర్‌గేట్ (Sandpapergate) విషయంలో ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) నిజం చెబుతుంటే.. కమిన్స్ అతడిని బలిపశువును చేశాడని వార్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. సిడ్నీ వేదికగా కమిన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఖవాజా వ్యాఖ్యలను కొట్టిపారేసిన కొన్ని గంటల్లోనే వార్నర్ ఇలా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడానికి కారణం ఉస్మాన్ ఖవాజా రాసిన ‘సబ్ర్ ‘ (Sabr) అనే ఆత్మకథ (Autobiography). 2018లో సౌతాఫ్రికాతో జరిగిన కేప్ టౌన్ టెస్టు (Cape Town Test) సమయంలో మైదానంలో శాండ్‌పేపర్ వాడుతున్న విషయం జట్టులోని అందరికీ తెలుసని ఖవాజా తన పుస్తకంలో బాంబు పేల్చాడు. అయితే, ఈ ఆరోపణలను ప్యాట్ కమిన్స్ మొదటి నుంచీ ఖండిస్తూనే వస్తున్నాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో (Optus Stadium) ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే కవరేజీలో భాగంగా ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడిన వార్నర్, ఖవాజాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. తాను ఇప్పటికీ ఉస్మాన్‌కు అండగా ఉంటానని, అతను ఆ పుస్తకంలో రాసిందంతా అక్షరాలా నిజమని వార్నర్ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖవాజాను చూస్తుంటే బాధేస్తోందని, కెప్టెన్ కమిన్స్ అతడిని ఇరికించడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని అన్నాడు. అంతేకాకుండా, ఆనాడు ఈ వివాదంపై జరిగిన విచారణ అంతా లోపభూయిష్టంగా సాగిందని వార్నర్ మరోసారి విమర్శించాడు. పెర్త్‌లో ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో (Sydney Cricket Ground) ప్యాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడాడు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఎంతసేపైనా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
Also Read
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
- Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
- KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
- AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
మరోవైపు.. కేప్ టౌన్ టెస్టులో బౌలింగ్ విభాగంలో భాగమైన కమిన్స్.. ఖవాజా వాదనలను పూర్తిగా తప్పుబట్టాడు. మైదానంలోకి శాండ్‌పేపర్ వెళ్తోందన్న విషయం జట్టులోని అందరికీ తెలుసని ఖవాజా అనడం 100 శాతం అబద్ధమని కమిన్స్ తేల్చి చెప్పాడు. గత ఎనిమిదేళ్లుగా తాను ఇదే మాట చెబుతున్నానని, ఆ కుట్ర గురించి తనకు ఏమీ తెలియదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, తాను మరికొందరు కలిసి ఈ బాల్ ట్యాంపరింగ్ ప్లాన్‌కు సూత్రధారులని ఖవాజా రాయడం మరీ దారుణమని, అవన్నీ అర్థం లేని పిచ్చి మాటలని కమిన్స్ కొట్టిపారేశాడు.
అసలు ఏంటి ఈ వివాదం?
2018 మార్చిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ శాండ్‌పేపర్ వివాదం చెలరేగింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ (Cameron Bancroft) బంతిని శాండ్‌పేపర్‌తో రుద్దుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) విచారణ జరిపి ముగ్గురు ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith), వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. ఇప్పుడు ఖవాజా పుస్తకంతో ఆ పాత గాయం మళ్లీ రేగడం, వార్నర్ వర్సెస్ కమిన్స్ అన్నట్లుగా మాటల యుద్ధం సాగడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
David Warner: “పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు”.. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
-
IND vs NZ 4th ODI: టీమిండియాకు వరుస షాక్స్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు స్టార్ బ్యాటర్లు డకౌట్!
-
Pete Hegseth: రక్షణ మంత్రినే మందలించిన సైనికుడికి అరుదైన గౌరవం.. స్వయంగా మెడల్ అందజేత!
-
CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
-
Rohit Sharma Record: 12 ఏళ్లయినా చెక్కుచెదరని హిట్‌మ్యాన్ రికార్డు.. చేరువలోనూ ఎవరూ లేరు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!