David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను క్రాస్ చేశాడు. ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. దీంతో సెంచరీల పరంగా ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కంటే తాను చాలా ముందున్నానని వార్నర్ తన సెంచరీతో చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా వార్నర్‌కి ఇది 47వ సెంచరీ.
Read Also: Shaheen Afridi: నాకు 5 వికెట్లు తీసే సత్తా ఉంది.. ఆస్ట్రేలియాపై అద్భుత బౌలింగ్
భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. అయితే ఓపెనర్‌గా అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 45 సెంచరీలు చేశాడు. కాగా ఇవాళ్టి మ్యాచ్ లో వార్నర్ సెంచరీ బాదడంతో 47కి చేరుకుంది. అలాగే ఓపెనింగ్‌లో మొత్తం 42 అంతర్జాతీయ సెంచరీలు చేసిన వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ దిగ్గజం సనత్ జయసూర్య 41 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హెడెన్ 40 సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 40 సెంచరీలతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.
Read Also: NewsClick Case: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్‌ఆర్ హెడ్‌లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసింది వీరే..
47 సెంచరీలు – డేవిడ్ వార్నర్
45 సెంచరీలు – సచిన్ టెండూల్కర్
42 సెంచరీలు – క్రిస్ గేల్
41 సెంచరీలు- సనత్ జయసూర్య
40 సెంచరీలు – మాథ్యూ హేడెన్
40 సెంచరీలు – రోహిత్ శర్మ.