NTV Telugu Site icon

David Warner Batting: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన డేవిడ్‌ వార్నర్‌.. నవ్వుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్! చివరకు

Untitled Design (3)

Untitled Design (3)

Pat Cummins laughs after David Warner bats Right Handed: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ లెఫ్టాండర్ అన్న విషయం తెలిసిందే. అయితే వేగంగా పరుగులు చేసేందుకు వార్నర్‌ అప్పుడప్పుడు తన స్టాన్స్‌ను మార్చుకుని రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు ఆడిన దేవ్ భాయ్.. సిక్సులు, బౌండరీలు కూడా బాదాడు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో కూడా వార్నర్‌ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్నర్‌ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ నవ్వులు పూయించాడు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌ రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్ చేశాడు. తొలి బంతిని అశ్విన్ ఆఫ్ బ్రేక్ వేయగా.. పాయింట్ దిశగా సింగిల్ తీశాడు. మూడో బంతికి స్వీప్ ద్వారా బౌండరీ బాదాడు. నాలుగో బంతికి మరో సింగిల్ తీశాడు. ఇది గమనించిన యాష్.. 15వ ఓవర్ తొలి బంతిని క్యారమ్ బాల్‌గా సంధించాడు. ఆ బంతిని స్విచ్ హిట్ చేయబోయిన వార్నర్.. వికెట్ల ముందు దొరికిపోయాడు.

Also Read: BAN vs NZ: మా కెప్టెన్ అలా చేయడం సరికాదు.. ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ మ్యాచులో డేవిడ్ వార్నర్ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అయితే ఆర్ అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్ ఔట్ అవ్వడం విశేషం. రైట్ హ్యాండ్ ఆడుతూ.. స్విచ్ హిట్ ప్రయత్నించబోయి ఎల్బీ అయ్యాడు. అయితే రివ్యూలో బంతి ప్యాడ్ల కంటే ముందు బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా తేలింది. వార్నర్ రివ్యూ తీసుకోకపోవడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు వార్నర్‌పై మండిపడుతున్నారు. బ్యాట్‌కు బంతి తాకిన సోయి లేకుండా ఆడుతున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచులో ఆసీస్ 99 పరుగుల తేడాతో ఓడింది.