NTV Telugu Site icon

Vizag: కన్నతండ్రి కన్నుమూసిన బాధలోనూ ఇంటర్‌ పరీక్ష.. తిరిగొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె..

Vizag

Vizag

Vizag: ఓ వైపు జీవితాన్ని ఇచ్చిన తండ్రి కన్నుమూసిన బాధ.. మరోవైపు భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు నిర్వహించే పరీక్ష.. అలాంటి పరిస్థితుల్లో రెండూ కార్యక్రమాలను పూర్తి చేసింది ఓ ఇంటర్‌ విద్యార్థిని.. కన్నతండ్రి మృతిచెందన బాధను గుండెను తొలచివేస్తుండగా.. మొదట పరీక్ష రాసిన ఆ విద్యార్థిని.. ఆ తర్వాత కన్నతండ్రి మృతదేహం వద్ద గుండెలు బాధకుంటూ విలపించింది.. చివరకు తానే అంత్యక్రియలు నిర్వహించింది.. క్లిష్టసమయంలోనూ తాను రెండు కర్తవ్యాలను నిర్వహించింది..

Read Also: Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న సుహాస్ మూవీ…

విశాఖలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పారిశ్రామిక ప్రాంతం హనుమాన్‌నగర్‌కు చెందిన 39 ఏళ్ల లాలం సోమేశ్వరరావు అనే వ్యక్తి క్యాన్సర్‌ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశాడు.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అయితే పెద్ద కుమార్తె మానసిక స్థితి బాగలేదు.. చిన్న కుమార్తె అయిన దిల్లీశ్వరి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించాల్సిందే తానేనని.. మొదట పరీక్షలు రాసేందుకు నిరాకరించింది దిల్లీశ్వరి.. కానీ, స్థానికులు, బంధువులు నచ్చజెప్పడంతో.. గుండెల నిండా బాధతోనే పరీక్షకు హాజరైంది.. బుధవారం ఉదయమే సోమేష్‌ మృతదేహానికి అంత్యక్రియల కోసం గుల్లలపాలెం శ్మశానవాటికకు తరలించినా.. దిల్లీశ్వరి పరీక్ష రాసివచ్చేవరకు అక్కడే మృతదేహాన్ని ఉంచారు.. డిల్లీశ్వరి పరీక్ష రాసి తిరిగివచ్చిన తర్వాత తన నాన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలచివేసింది.