Site icon NTV Telugu

Tollywood: దసరా ఊపే లేదు..

Tollywood

Tollywood

Tollywood: టాలీవుడ్‌కి దసరా ఒక మంచి సీజన్. సంక్రాంతి అంత కాకపోయినా, దసరాకి కూడా చిన్న పిల్లలకు తొమ్మిది రోజులు సెలవులు వస్తాయి. మిగతా వాళ్లకి మూడు నుంచి నాలుగు రోజులు సెలవులు లభిస్తాయి. కాబట్టి, ఈ సీజన్‌లో కూడా సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, ఈసారి మాత్రం దసరా సీజన్‌ని పెద్దగా ఎవరూ టార్గెట్ చేయలేదు. ఓ.జి. సినిమా కూడా దాదాపు పది రోజుల ముందుగానే రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా ఓపెనింగ్స్ బాగున్నాయా అంటే, అది లేదు. సినిమా రిలీజ్ అయిన మొదటి సండేనే బుకింగ్స్‌లో డ్రాప్ కనిపించింది. ఇక అఖండ 2 రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ, ఈ వారం అసలు తెలుగు సినిమాలే లేవు.

READ MORE: H-1B visa: H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు.. ఫిబ్రవరి నాటికి కొత్త వ్యవస్థ..

తమిళం నుంచి ఒక సినిమా, కన్నడ నుంచి మరో సినిమా డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఒకటి ఇడ్లీ కొట్టు సినిమా కాగా, మరొకటి కాంతారా చాప్టర్ 1. ఇడ్లీ కొట్టు సినిమా మీద బజ్ లేదు. కానీ, ధనుష్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. ఒకపక్క సార్, మరోపక్క కుబేర హిట్స్ తర్వాత ఆయన రావడంతో సినిమా మీద కూడా ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. కాంతారా లాంటి సక్సెస్ తర్వాత కాంతారా చాప్టర్ 1 వస్తూ ఉండడంతో ఆ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడంతో తెలుగు ఆడియన్స్ పెద్దగా ఉత్సాహం లేనట్లు ఫీల్ అవుతున్నారు.

Exit mobile version