Site icon NTV Telugu

Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..

Daryl Mitchell

Daryl Mitchell

చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ లో మిశ్రమ ఫలితాలతో దూసుకెళ్తుంది. సీఎస్‌కే ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గత ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇకపోతే., ఈ గేమ్‌కు ముందు జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read: Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..

ధర్మశాల మైదానంలో ఈ మ్యాచ్ జరగగా., కొంతమంది అభిమానులు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందే స్టేడియానికి చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ లో దృశ్యాలను తీసుకుంటున్నారు. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డారిల్ మిచెల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ సిద్ధమవుతున్నాడు. అయితే ఉన్నటు ఉండి అతను ప్రాక్టీస్ చేసే సమయంలో చూసేందుకు వచ్చిన ఓ అభిమాని మొబైల్‌కు బంతి తగిలింది. దీంతో దెబ్బకు ఫోన్ పాడైంది.

Also read: Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..

ఈ విషయం తెలుసుకున్న డారిల్ మిచెల్ సంబంధిత అభిమానికి క్షమాపణలు చెప్పాడు. తన చేతికి ఉన్న గ్లోవ్స్‌ను గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు. దాంతో అభిమాని ఊహించలేని ఆనందంలో మునిగిపోయాడు. ఎందుకంటే., త‌న ఖ‌రీదైన ఫోన్ ప‌గిలిపోయింద‌న్న బాధ కంటే అతను మిచెల్ చేతి గ్లోవ్స్ అందుకున్నందుకు. ఇక ఈ గతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Exit mobile version