Rebel Star : ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ తో రెబల్ స్టార్ ఫన్ చాట్.. ప్రభాస్ లుక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లో ‘కపుల్ ఫ్రెండ్లి’ మంచి హిట్ గా నిలిచింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మానస వారణాసి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఈ సినిమా సక్సెస్ జోరులో ఉండగానే, చిత్ర యూనిట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోడవ్వడం విశేషం. ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన హింట్‌తో ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగం కానున్నారని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ప్రభాస్ ఎంతో చార్మింగ్ లుక్స్‌లో కనిపిస్తూ, చిత్ర యూనిట్‌తో ఎంతో సరదాగా ముచ్చటించడం అభిమానులను అలరిస్తోంది. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఫన్ మూమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరోయిన్ మానస వారణాసి, ప్రభాస్‌ని ఉద్దేశించి “మీకు లవ్ అంటే ఏంటి?” అని అడగగా.. డార్లింగ్ తనదైన శైలిలో నవ్వుతూ “ఇది పర్సనల్ క్వశ్చన్” అంటూ బదులివ్వడం హైలెట్ గా నిలిచింది. ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో ఈ శనివారం రిలీజ్ చేయనుంది యూవీ క్రియేషన్స్. ప్రభాస్ వంటి స్టార్ హీరో సపోర్ట్ లభించడంతో ‘కపుల్ ఫ్రెండ్లి’ సినిమా వసూళ్లు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read : HeyBalwanth : హే బలవంత్ ఓవర్సీస్ & ప్రీమియర్ రివ్యూ
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!