Louise Fischer: కరోనా మహమ్మారి సృష్టించిన దారుణ పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జీవితాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా.. డెన్మార్క్‌లో ఓ జర్నలిస్టు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. డానిష్ రేడియో రిపోర్టర్ లూయిస్ ఫిషర్ (26) స్వింగర్స్ క్లబ్ గురించి కథనం తయారుచేయడానికి వెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ మధ్యలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం, డెన్మార్క్‌లోని ఇష్హోయ్ ప్రాంతంలో ఉన్న ‘Swingland’ అనే స్వింగర్స్ క్లబ్ మళ్లీ తెరచుకుంది. ఈ క్లబ్ రీఓపెనింగ్ నేపథ్యంలో ‘రేడియో 4’ అనే డానిష్ స్టేషన్‌కి ఫిషర్ ఒక ప్రత్యేక కథనం తయారుచేసేందుకు అక్కడికి వెళ్లింది. క్లబ్ వాతావరణం, అక్కడ జరిగే అంశాలను ప్రత్యక్షంగా అనుభవించాలన్న ఉద్దేశంతో ఆమె అక్కడ పరిశోధనకు వెళ్లింది.
Read Also:Andhra King Taluka: ‘నువ్వుంటే చాలే’ అంటున్న రామ్ పోతినేని..!(వీడియో)
ఇక ఫిషర్ క్లబ్‌కి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న గెస్ట్ లతో మొదట వైన్ తాగుతూ మాట్లాడినట్లు తెలిపింది. ఆ తరువాత క్లబ్‌లో ఉన్న పడకపై, ఆమె ఒక అతిథితో శృంగారంలో పాల్గొంటూ ఇంటర్వ్యూకు కొనసాగింది. ఇదంతా ఆడియో రూపంలో రికార్డు చేయబడింది. ఆ ఇంటర్వ్యూలో ఒక సమయంలో ఆమె ఆ వ్యక్తిని ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు..? అని అడగగా, అతను “ఒక అద్భుతమైన మహిళను చూస్తున్నాను, తాను స్వింగర్స్ క్లబ్ కి తొలిసారి వచ్చింది” అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు వీరి శృంగార శబ్దాలు కూడా ఆ ఇంటర్వ్యూలో బాగా వినిపించాయి. ఈ రెండు నిమిషాల ఆడియో క్లిప్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
Read Also:My Baby Review : మై బేబీ రివ్యూ
ఈ అనుభవంపై ఫిషర్ మాట్లాడుతూ.. ఇది నా జీవితంలోని అత్యుత్తమ శృంగార అనుభవం కాదు. కానీ. అవసరమైతే మళ్లీ చేయవచ్చు అని తెలిపింది. అంతేగాక, ఈ చర్య తన బాస్‌లు ఒత్తిడి చేయలేదని, క్లబ్ గెస్ట్‌లు కూడా ప్రేరేపించలేదని.. పూర్తిగా తనకు సహజంగా అనిపించిందని చెప్పింది. ఈ చర్య క్లబ్ గెస్ట్‌లను రిలాక్స్ చేయడంలో వారు ఓపెన్‌గా మాట్లాడేలా చేయడంలో సహాయపడిందని పేర్కొంది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఫిషర్ చేసిన పనిని ‘ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఓ కొత్త దారి’ అని ప్రశంసించగా.. మరికొందరు మాత్రం జర్నలిజం ఇంతకు దిగజారాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇక సదరు రేడియో 4 ఛానల్ ఆమెను బహిరంగంగా సమర్థించింది. ఆమె చర్య వల్ల కథనానికి మరింత ఆదరణ వచ్చిందని అభిప్రాయపడింది.
