తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం వేడిని రాజేస్తోంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తున్నారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆందోల్ నియోజకవర్గంలో ప్రవేశించే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దామోదర రాజనరసింహ.. రాజకీయాల్లో గెలిచిన, ఓడినా గత 50 సంవత్సరాలుగా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీతోనే ఉందన్నారు.
Read Also: Ntv Effect: కరణ్ కోర్ట్ లో అక్రమ మైనింగ్ పై అధికారుల దాడులు
టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, నాయకులు అభద్రత భావంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ మారుస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేని పార్టీ, ఈ పార్టీలో ఎప్పుడు ఎవరు పార్టీ మారుతారో తెలియదు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఎరగా వేసి రాజకీయ లబ్దిపొందుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దామోదర రాజనరసింహ. రాహుల్ పాదయాత్రకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
Read Also: Chiranjeevi: గరికిపాటిపై చిరంజీవి సెటైర్.. వీడియో వైరల్