NTV Telugu Site icon

Damodar Raja Narasimha: కుల గణన కావాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలే

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గల్లి నుంచి జిల్లా పరిషత్ వరకు కాంగ్రెస్ నాయకులే ఉండాలే అన్నారు. నాగ మడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను మా ఎమ్మెల్యే లక్ష్మి కాంతరావు ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని, ఇప్పటికే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కుల గణన రావాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలే అని ఆయన వ్యాఖ్యానించారు. రుణ మాఫీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. రైతు భీమా తో పాటు పంట భీమా తీసుకు వస్తామని, కేంద్రంలో 35 లక్షల ఉద్యోగాలు అవసరం ఉన్న బీజేపీ భర్తీ చేయలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ గానే ఉద్యోగాలను భర్తీ అని ఆయన తెలిపారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగాయంటే కుటుంబ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించండని మంత్రి కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో సోనియా గాంధీ తమ పార్టీ పూర్తిగా కొల్పోతుందని ముందుగానే గ్రహించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ నిదర్శనంగా నిలిచాయని అన్నారు. అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు,సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు.