Site icon NTV Telugu

Gujarat: గుజరాత్‌లో కొత్త బట్టలు, కళ్లజోడు పెట్టుకున్నందుకు దళితుడిపై దాడి

Gujarath Dalith Man

Gujarath Dalith Man

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తిపై అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. అతని మంచి డ్రెస్సింగ్ సెన్స్ మరియు సన్ గ్లాసెస్ చూసి కోపోద్రిక్తులైన అగ్రవర్ణ వర్గానికి చెందిన వ్యక్తులు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి (మే 30) పాలన్‌పూర్ తాలూకాలోని మోటా గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు నిన్న ( గురువారం ) తెలిపారు. మంగళవారం ఉదయం వ్యక్తి తన ఇంటి బయట నిలబడి ఉండగా ఏడుగురు నిందితులలో ఒకరు అతని వద్దకు వచ్చి దుర్భాషలాడాతూ.. చంపేస్తానని బెదిరించాడు.. దీంతో దళిత వ్యక్తి జిగర్ షెఖాలియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read : Saloni : అయ్యో.. తెలుగుమ్మాయి ఏంటి ఇలా మారిపోయింది..?

అయితే అదే రాత్రి, రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన ఆరుగురు నిందితులు గ్రామంలోని ఆలయం బయట నిలబడి ఉన్న వ్యక్తిని చూశారు. కర్రలు, ఆయుధాలు తీసుకుని ఫిర్యాదుదారుడి వద్దకు వెళ్లి, అతను మంచి దుస్తులు ధరించి, కళ్లజోడు ఎందుకు ధరించాడని అడిగి.. మరీ అతన్ని కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడిలి తల్లి అతనిని రక్షించడానికి పరుగెత్తింది.. అయితే ఆమెపై కూడా ఏడుగురు వ్యక్తులు దాడి చేశారు. నిందితులు ఆమె బట్టలు చింపేసి చంపుతామని బెదిరించారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆ వ్యక్తి మరియు అతని తల్లి ఇద్దరూ ఆసుపత్రికి తరలించారు.

Also Read : Delhi Police: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ పై రెండు కేసులు నమోదు..

నిందిుతులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ల కింద ఏడుగురిపై గఢ్ పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, ఒక మహిళపై దాడి చేయడం స్వచ్ఛందంగా గాయపరచడం, అసభ్య పదజాలం ఉపయోగించడం మొదలైనవాటికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

Exit mobile version