కర్ణాటక లో ఎస్సీ వర్గీకరణను దళిత సంఘాలు స్వాగతించినట్లు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 15 శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు 17 శాతం పెంపు, 3 శాతం రిజర్వేషన్లు ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు 7 శాతం పెంచటం పై బీజేపీకి దళిత, ఎస్టీ సంఘాలు మద్దతు పలికినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రమంత్రులు నారాయణ స్వామి, మురుగన్, MRPS జాతీయ నాయకులు మంద కృష్ణ మాదిగ తో కలిసి సమావేశమై సమీక్ష చేసిన ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ జి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో కలిసి సమీక్ష చేశారు.
Also Read : RJD Leader: బ్రాహ్మణులు ఇండియన్స్ కాదు.. ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ లకు కలిసి 6 శాతం రిజర్వేషన్లు పెంచిన బీజేపీ సర్కారుకు దళిత, గిరిజన సంఘాలు పూర్తి మద్దతును ప్రకటించాయి. తెలంగాణ లో కూడా ఎస్సి, ఎస్టీ, ఓబీసీ లకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ముస్లిమ్స్ కోసం రిజర్వేషన్లు ఇచిన వాళ్లు రాజ్యాంగ బద్దంగా దళిత , గిరిజనులకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందని మరోసారి రుజువైంది. ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రేస్ దళిత, గిరిజన రిజర్వేషన్లను వ్యతిరేకించడం , దళిత వర్గీరణను కర్ణాటక లో వ్యతిరేకించిన కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమ్ అన్నారు. తెలంగాణ లో దళిత , గిరిజనుల కు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
Also Read : Explosion: కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం
