Site icon NTV Telugu

Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచకపడ్డ డేల్ స్టెయిన్..!

Styen

Styen

Dale Steyn Slams David Miller Decision: ఐపీఎల్ 2026 14వ మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ఒక్క పరుగుతో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ పోరాడినప్పటికీ.. గుజరాత్ ఒక్క పరుగుతో థ్రిల్లింగ్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌ లో డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడినప్పటికీ, చివర్లో తీసుకున్న ఒక నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ఓడిపోతున్న మ్యాచ్ ను మిల్లర్ కేవలం 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. అయితే మ్యాచ్ చివరి ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ వేసిన బంతులు మ్యాచ్ రిజల్ట్ నే మార్చేశాయి.

GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!

చివరి ముందు బంతికి ఒక సింగిల్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ దాన్ని తిరస్కరించాడు. ఆ సింగిల్ తీసుకుంటే స్కోరు సమం అయి మ్యాచ్ సూపర్ ఓవర్‌ కు అయినా వెళ్లేది. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌ లో ఉన్న కుల్దీప్ యాదవ్ కూడా సింగిల్‌కు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయినప్పటికీ మిల్లర్ తానే మ్యాచ్ ముగించాలని భావించి ఆ రన్ తీసుకోలేదు. దీనితో ఢిల్లీ మాస్క్ ఓడిపోయిందని చెప్పాలి.

ఇక ఈ నిర్ణయంపై మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ విమర్శలు గుప్పించాడు. ఒత్తిడి సమయంలో అనుభవం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని, ప్రమాదకరమైన షాట్‌ కు బదులుగా సేఫ్‌గా సింగిల్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అధిక ఒత్తిడి పరిస్థితులలో ఆటగాళ్లు వారి నమ్మకం కంటే జట్టు విజయానికి అవసరమయ్యే క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని స్టెయిన్ అన్నారు. అంతకుముందు భారీ సిక్సర్ కొట్టడంతో మిల్లర్ ఆత్మవిశ్వాసం పెరిగిందని తాను భావించినప్పటికీ, అనుభవం కారణంగా అతను మరింత సురక్షితమైన పద్ధతిని అనుసరించి ఉండాల్సిందని స్టెయిన్ అన్నారు.

Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

మిల్లర్ లాంటి ఆటగాడు ఇలాంటి సందర్భంలో సింగిల్ తీసుకోవడం మిస్ అవ్వకూడదుని పేర్కొన్నాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్ స్లో బాల్‌ ను మిస్ అయ్యాడు. ఆ తర్వాత తీసుకోవాలని ప్రయత్నించిన సింగిల్‌ లో రన్ అవుట్ కావడంతో ఢిల్లీ విజయాన్ని అందుకోవడంలో ప్లాప్ అయ్యింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగుతో సంచలన విజయం నమోదు చేసింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ఈ సీజన్‌లో తొలి పరాజయం ఎదురైంది. ఇక ఏప్రిల్ 11న చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ తలపడనుంది.

Exit mobile version