కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. కుటుంబంలో అనుకూలతలు పొందుతుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఉంటాయి. ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు. కర్కాటక రాశి వారికి నేడు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. మీరు చేయాల్సిన పూజ దేవీ గడ్గమాల స్తోత్రంను పారాయణం చేయడం మంచిది.
కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించిన నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం నాటి రాశి ఫలాలను తెలిపారు. శుక్రవారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు అందుకోండి.
